Monday, 3 October 2011

పండుగకు వేయి బస్సులు నడపండి:సీఎం

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కనీసం వేయి బస్సులను నడపాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు చేశారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమావేశం జరిగింది. విద్యుత్‌కోతను పండుగ సందర్భంగా లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను కోరారు. వ్యవసాయరంగానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 500 బస్సులను సిద్ధం చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా స్తంభించిందని పక్క రాష్ట్రాలనుంచి విద్యుత్ కొనుగోలు చేసి, కొరత లేకుండా చూస్తామని ట్రాన్స్‌కో ఎండీ తెలిపారు.