నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్‌లో ఆరు ఆంధ్రా బస్సుల అద్దాలను తెలంగాణ
వాదులు ధ్వంసం చేశారు. తెలంగాణలో ఇంత ఉధృతంగా సమ్మె జరుగుతున్న కూడా
బస్సులు ఎందుకు నడుపుతున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపైకి తెలంగాణ వాదులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
నెలకొంది. సీఐ విశ్వనాథ్ తలకు గాయాలయ్యాయి. సూర్యాపేటలో మూడు బస్సుల
అద్దాలను ధ్వంసం చేశారు.