Monday 3 October 2011

ప్రపంచ బ్యాంకు నిధులన్నీ సీమాంధ్రకే

- తెలంగాణకు మరో దగా!
- ఏపీఎండీపీ కింద 10 శాతం కూడా దక్కని నిధులు
- ఒక్క కార్పొరేషన్‌ను ఎంపిక చేయని వైనం

సిటీబ్యూరో, అక్టోబర్ 2 (టీ న్యూస్): సీమాంధ్ర పాలనలో అడుగడుగునా వివక్షకు గురవుతున్న తెలంగాణ ప్రాంతానికి మరో అన్యాయం జరిగింది. ఓవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెతున్న ఎగిసిపడుతున్న తరుణంలో...పపంచ బ్యాంకు నిధుల్లో తెలంగాణ ప్రాంతానికి 10 శాతం కూడా కేటాయించకుండా సీమాంధ్ర నాయకులు నిధులన్నింటీ తమ ప్రాంతానికి మళ్లించుకున్నారు. ఆంధ్రవూపదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(ఏపీఎండీపీ)లో భాగంగా రూ.1670.55కోట్ల (350మిలియన్‌లు)తో రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు సహా మొత్తం 13 మున్సిపాలిటీల్లో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణచయించింది. ఇందులో రూ.1431.91కోట్లు (300మిలియన్ డాలర్లు) ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేయనుండగా, రూ. 146 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మరో రూ.92 కోట్లు స్థానిక సంస్థలు భరించాల్సివుంది. ఈ మేరకు 2010 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కే రోశయ్య, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ రోబెర్టో ఎన్. జఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఫిబ్రవరి 15, 2010న మొదలుపెట్టి ఐదేళ్లలో, అంటే డిసెంబర్, 2015కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి వుంది.

కన్సల్టెంట్ల చేత సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొనసాగుతుండగా.. ప్రస్తుతం అది తుదిదశకు చేరుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కింద కాకినాడకు రూ.400 కోట్లు, విజయనగరానికి రూ. 170కోట్లు కేటాయిస్తుండగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మణుగూరుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణ నుంచి ఎంపిక చేసిన మరో రెండు పట్టణాల్లో ఒకటి ఇప్పటికే గ్రేటర్‌లో విలీనమైన మల్కాజ్‌గిరి కాగా.. మరోటి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణం. ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికే మంచినీటి సరఫరా వ్యవస్థ ఉండడంతో కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో పైప్‌లైన్లు నిర్మించాల్సివుంది. ఇందుకోసం మహా అయితే మరో రూ. 100కోట్లు వెచ్చించే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అంటే రూ. 1600 కోట్ల పైచిలుకు నిధుల్లో తెలంగాణకు దక్కుతున్నది కేవలం రూ. 150కోట్ల లోపే. ఇతర ఎంపిక చేసిన ప్రాంతాలతో పోల్చుకుంటే తెలంగాణ నుంచి ఎంపికచేసిన పట్టణాలు జనాభా పరంగా కూడా చిన్నవి కావడంతో నిధుల వ్యయం అంతగా ఉండదన్నది ప్రభుత్వం వాదన.
కాగా, తెలంగాణ ప్రాంతంలోని పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా.. సీమాంధ్ర ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుత వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికంగా పునరుద్ధరించాలని నిర్ణయించడం గమనార్హం. నిధుల కేటాయింపులో అన్యాయమే కాకుండా రాష్ట్రం నుంచి ఎంపికచేసిన 13 పట్టణాల్లో తెలంగాణ నుంచి మూడు పట్టణాలనే ఎంపిక చేయడం గమనార్హం. ఎంపికచేసిన వాటిలో కూడా తెలంగాణ నుంచి ఒక్క కార్పొరేషన్‌కు చోటు లభించకపోగా, సీమాంవూధకు చెందిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయడం ప్రభుత్వ వివక్షకు అద్దం పడుతోంది.
ఎంపికచేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వివరాలు..
పలాస కాశీబుగ్గ, మార్కాపూర్, గుంటూరు, మల్కాజ్‌గిరి(వూపస్తుతం గ్రేటర్‌లో విలీనమైన పాత మున్సిపాలిటీ ఏరియా), ఆర్మూర్, కర్నూలు, విజయనగరం, కాకినాడ, మణుగూరు, అనంతపూర్, చిత్తూరు, బద్వేల్, నెల్లూరు. ఇందులో ఆంధ్రా ప్రాంతానికి చెందిన గుంటూరు, కాకినాడ, నెల్లూరు కార్పొరేషన్లతోపాటు రాయలసీమకు చెందిన కర్నూలు కార్పొరేషన్‌కు చోటు కల్పించారు.

నల్లగొండలో పరిస్థితి ఉద్రిక్తం

నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్‌లో ఆరు ఆంధ్రా బస్సుల అద్దాలను తెలంగాణ వాదులు ధ్వంసం చేశారు. తెలంగాణలో ఇంత ఉధృతంగా సమ్మె జరుగుతున్న కూడా బస్సులు ఎందుకు నడుపుతున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైకి తెలంగాణ వాదులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఐ విశ్వనాథ్ తలకు గాయాలయ్యాయి. సూర్యాపేటలో మూడు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.

ఆమరణదీక్షకు సిద్ధమైన ఎమ్మెల్యే ఓదేలు

ఆదిలాబాద్: సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్సు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి దీక్షకు కూర్చున్న చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆమరణ దీక్షకు కూర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సింగరేణి యజమాన్యం ఉదయం నుంచి కార్మికులకోసం ఓదేలు దీక్ష చేస్తున్న పట్టించుకోకపోవటంతో కార్మికులకోసం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

జైపాల్‌రెడ్డి రాజీనామాకు టీజేఏసీ డిమాండ్

న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ఈనెల 7 వతేదీలోగా రాజీనామాచేయాలని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని తెలంగాణ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రధానిని కలిసేందుకు వెల్లిన జేఏసీ నాయకులకు ప్రధాని నివాసానికి వచ్చిన జైపాల్‌రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డిని తెలంగాణ జేఏసీ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటు బస్సులను తగ్గించిన యజమానులు

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్‌ను నిందితుడిగా చేర్చుతూ ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో అర్గల్‌ను ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలని లోకసభ స్పీకర్ మీరాకుమార్‌కు ఢిల్లీ పోలీసులు వినతి పత్రం సమర్పించారు.

ప్రైవేటు బస్సులను తగ్గించిన యజమానులు

విజయవాడ: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేటు బస్సులను యజమానులు తగ్గించుకున్నారు. నల్లగొండ, తెలంగాణలోని పలుచోట్ల సీమాంధ్ర బస్సులపై దాడి జరుగటంతో తెలంగాణకు వెల్లే బస్సుల సంఖ్యలను తగ్గించుకున్నట్లు ప్రైవేటుబస్సుల యజమానులు తెలిపారు.