Monday, 3 October 2011

కాలపరిమితితో కూడిన కార్యచరణ: జానా

హైదరాబాద్: తాము ఏ త్యాగం చేసినా పార్టీ ప్రతిష్టను పెంచేలా చర్యలు తీసుకుంటామని జానారెడ్డి స్పష్టం చేశారు. దేశరాజధానిలో ప్రధాని, పలువురు నేతలతో సమావేశమైన తర్వాత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణను అధిష్టానం ప్రకటించాలని జానారెడ్డి డిమాండ్‌చేశారు. తాము ఏ జేఏసీతో కలువమని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ వెంటనే వచ్చేలా అందర్ని కలుపుకుపోతామన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించబోమని ఆయన అన్నారు.